Share News

SP: నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:08 AM

నేరాల విషయంలో, ట్రాఫిక్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్‌ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్‌ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు.

SP: నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
SP presenting a certificate of appreciation to a constable in Battalapally

ధర్మవరం, పిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): నేరాల విషయంలో, ట్రాఫిక్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్‌ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్‌ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక పాత్ర పోషించాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపె తక్షణమే స్పందించాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బత్తలపల్లి పోలీస్‌స్టేషనలో విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు నాగేంద్రప్రసాద్‌, ప్రభాకర్‌, ఎస్‌ఐ ఉమాదేవి, సోమశేఖర్‌ ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 11 , 2026 | 12:08 AM