BJP: అమరవీరులకు ఘన నివాళి
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:56 PM
పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను దేశం మరువదని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు అన్నారు. బీజేపీ మండల అద్యక్షుడు దేవర రాము ఆధ్వర్యంలో దాడి తోట గ్రామంలో అమరు వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
తాడిమర్రి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను దేశం మరువదని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు అన్నారు. బీజేపీ మండల అద్యక్షుడు దేవర రాము ఆధ్వర్యంలో దాడి తోట గ్రామంలో అమరు వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోనాయకులు గొట్లూరు చంద్ర, కృష్ణమనాయుడు, రమణ, ఆనంద్, నాగార్జున, గంగులప్ప పాల్గొన్నారు.
ముదిగుబ్బ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు శనివారం రాత్రి కిషన మోర్చా ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి బస్టాండ్ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో వీర జవాన్ల చిత్రపటం ఉంచి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిషన మోర్చా అధ్యక్షుడు సోమల ప్రకాష్, ఉపాధ్యక్షుడు పసుపులేటి వెంకటేష్, కిషన మోర్చా నాయకులు గంగులప్ప, నారాయణ, శివకుమార్, అశోక్, రాములు, కేశవ, మహేష్, త్రినాథ్, ప్రసాద్, పుల్లప్ప, సోమశేఖర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....