FESTIVALS: కాటమ క్షేత్రంలో సందడి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:53 PM
మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు.
తాడిమర్రి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు. ఇన్ని రోజులుగా మూతపడ్డ అన్నదాన కేంద్రాన్ని దాడితోట గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. అన్నదాన కమిటీ అధ్యక్షుడిగా అమర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యక్షునిగా శ్రీనివాస రెడ్డిని ఎన్నుకుని అన్నదానం ప్రారం భించడంతో పాటు భోజన శాలను శుభ్రంచేసి కొత్తగా రంగులు వే యించారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి రోజు మధ్యాహ్నం నుంచి కోలాట బృందాలు అర్థరాత్రి 12గంటల వరకు కోలాటం వేస్తున్నాయి. అదే విధంగా ఆలయ పరిసరాల్లో లైట్లు, బారికే డ్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లను శుభ్రం చేయడం, పార్కింగ్‌స్థలాల ఏర్పాట్ల పనులు ప్రారంభించారు. మొత్తమ్మీద ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....