Share News

GOD: కాటమక్షేత్రంలో శివరాత్రి వేడుకలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:05 AM

మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు కన్నుల పం డువగా సాగాయి. టీడీపీ నియో జకవర్గం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ చొరవతో పాటు కూట మి నాయకులు పలు మార్లు చ ర్చలు జరిపి సమస్యను పరిష్క రించడంతో దేవాదాయశాఖ ఆ ధ్వర్యంలో ఉత్సవాలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశారు.

GOD: కాటమక్షేత్రంలో శివరాత్రి వేడుకలు
The temple is crowded with devotees

తాడిమర్రి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు కన్నుల పం డువగా సాగాయి. టీడీపీ నియో జకవర్గం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ చొరవతో పాటు కూట మి నాయకులు పలు మార్లు చ ర్చలు జరిపి సమస్యను పరిష్క రించడంతో దేవాదాయశాఖ ఆ ధ్వర్యంలో ఉత్సవాలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశారు. ఎస్పీ సతీశ కుమార్‌ ఆధ్వర్యంలో ఏఎస్పీ అంకితా సురాన ఆదివారం కాట కోటేశ్వరాన్ని, చిల్లవారిపల్లిని సందర్శించి భద్రతా విషయంలో పోలీసులకు సూచనలు చేశారు. ఉదయం 7గంటల నుంచే కాటమ క్షేత్రం, చిల్లవారిపల్లిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. చిల్లవారిపల్లి నుంచి స్వామివారి ఆభరణాలను గుర్రాలపై, ఎలవగంపలో ఉంచి కాటకోటేశ్వర క్షేత్రానికి బయలు దేరారు. సోమవారం తెల్లవారు జామునకు కాటకోటేశ్వర క్షేత్రానికి చేరుకోనున్నాయి. ఆదివారం మధ్యా హ్నం మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు, ఆలయ అదికారులు, సభ్యులతో చర్చ లు జరిపారు. అన్నదాన కేంద్రంలో మంత్రి స్వయంగా అన్నదానం చేసి, రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం తాడిమర్రిలోని శివాలయాన్ని మంత్రి సందర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డిశ్రీనివాసులు, టీడీపీ మండల కన్వీనర్‌ కూచిరాము, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్‌, సాయి, బీజేపీ నాయకులు రాము, ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2026 | 12:05 AM