Share News

TDP: క్రీడలలో అంతర్జాతీయస్థాయిలో రాణించాలి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:15 AM

క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్‌బాల్‌ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్‌-16 విభాగం 12వ ఫుట్‌ బాల్‌ బాలుర, బాలికల లీగల్‌ పోటీలను నిర్వహించారు.

TDP: క్రీడలలో అంతర్జాతీయస్థాయిలో రాణించాలి
Sandha Raghava presenting the prize to the winning team

ధర్మవరం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్‌బాల్‌ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్‌-16 విభాగం 12వ ఫుట్‌ బాల్‌ బాలుర, బాలికల లీగల్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ధర్మవరం, హిం దూపురం, ఆత్మ కూరు బాలుర జట్లు తలపడ్డాయి. ఇందులో ధర్మవరం జట్టు విన్నర్‌గా, హిందూపురం జ ట్టు రన్నర్‌గా నిలిచాయి. అదేవిధంగా శె ట్టూరు, హిందూపురం బాలికల జట్లు తలప డగా హిందూపురం బాలికల జట్టు విన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన జట్టకు ముఖ్య అ తిథిగా హాజరైన సంధారాఘవ షీల్డ్‌లను ప్ర దానం చేశారు. ఫుట్‌బాల్‌ అసోసియేషన పట్టణ జాయింట్‌ సెక్రటరీ జింకా పురుషో త్తం, కార్యదర్శి చందు, విజయభాస్కర్‌, దుర్గాప్రసాద్‌, చైతన్య పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2026 | 12:15 AM