FESTIVALS: ఉత్సవాలకు కాటకోటేశ్వర క్షేత్రం సిద్ధం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:09 AM
కాకిముట్టని క్షేత్రంగా పేరు గాంచిన మండలపరిధిలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి కేత్రం మ హా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హే మంతకుమార్, టీడీపీ ఽనియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్, పలు మార్లు గ్రామస్థులతో చర్చించి ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉ త్సవాలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించారు.
తాడిమర్రి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కాకిముట్టని క్షేత్రంగా పేరు గాంచిన మండలపరిధిలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి కేత్రం మ హా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హే మంతకుమార్, టీడీపీ ఽనియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్, పలు మార్లు గ్రామస్థులతో చర్చించి ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉ త్సవాలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించారు. దీంతో శుక్రవారం కాటకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మండల ప్రజలతో సమా వేశం నిర్వహించారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను అధికారులు, నాయకు లు విడుదల చేశారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఈఓ వెంకటేశ్వర్లు పరిటాల శ్రీరామ్‌కు అందజేశారు. మండల ప్రజలు, భక్తులు ఉత్సా హంగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని పరిటాల శ్రీరామ్ అధికారులను కోరారు. అనంతరం అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మరింత మెరుగ్గా ఉండాలని, ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హేమంతకుమార్, సీఐ సునీత, ఎస్‌ఐ క్రిష్ణవేణి, టీడీపీ మండల కన్వీనర్ కూచి రాము, నాయకులు కొడిదెలశేఖర్, శ్రీనివాసరెడ్డి, విశ్వనాథరెడ్డి, బొట్టు కిష్ట, తలారి చంద్రమోహనబాబు, రమణయ్య, యల్లప్ప, బద్రి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....