Share News

GODDESS: కోర్కెలు తీర్చె పాతూరు పెద్దమ్మ

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:01 AM

మండల కేంద్రం లోని పాత వూరిలో వెలసిన గ్రామదేవ త పెద్దమ్మ కోర్కెలు తీర్చె కొంగు బంగా రమని భక్తుల నమ్మకం. శివరాత్రి సం దర్భంగా మూడురోజులు జాతర నిర్వ హిస్తారు. ఈ జాతరకు ముదిగుబ్బ మండలం నుంచి కాకుండా కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణ, కర్ణా టక ప్రాంతాల నుంచి భక్తులు తరలివ స్తారు.

GODDESS: కోర్కెలు తీర్చె పాతూరు పెద్దమ్మ
Patavuru Peddamma Goddess

శివరాత్రి సందర్భంగా జాతరకు ముస్తాబవుతున్న ఆలయం

ముదిగుబ్బ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని పాత వూరిలో వెలసిన గ్రామదేవ త పెద్దమ్మ కోర్కెలు తీర్చె కొంగు బంగా రమని భక్తుల నమ్మకం. శివరాత్రి సం దర్భంగా మూడురోజులు జాతర నిర్వ హిస్తారు. ఈ జాతరకు ముదిగుబ్బ మండలం నుంచి కాకుండా కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణ, కర్ణా టక ప్రాంతాల నుంచి భక్తులు తరలివ స్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం వివిధ రంగులతో ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం మొదటి రోజు ఉదయం అమ్మవారిని వెండి ఆభరణాలు, భుజకిరీటాలు, వెండి గొడుగులు, వేప మండలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. రాత్రికి అమ్మవారిని పల్లకిలో ఉంచి డప్పుల వాయిద్యాలు, కోలాటాల నడుమ గ్రామోత్సవం నిర్వహిస్తారు.


అమ్మవారి పల్లకిని పోటు కుమారులు పూలతో సుందరంగా అలంకరిం చి అమ్మవారిని ఊరేగించేటప్పుడు ప ల్లకి వెంట ఉంటారు. జాగరణ రాత్రి వచ్చిన భక్తులందరికీ దాతల సహకా రం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అ న్నదానం నిర్వహిస్తారు. రెండో రోజు సోమవారం తెల్లవారుజామున నల్లల మ్మ గద్దె మీద అమ్మవారి పల్లకిని ఉంచి జాతర జరిపిస్తారు. మూడో రోజు పాతవూరిలోని పెద్దమ్మ దేవత ఆలయ ప్రాంగణంలో గాజులు, ఆట బొమ్మలు, తినుబండారాల దుకాణాల తో పరుష జరిపిస్తారు. ప్రతి ఇంటి లోనూ పండుగను ఎంతో భక్తి శ్ర ద్ధలతో జరుపుకుంటారు. చాలామంది భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి జాతరకు ముందుగానే ముదిగుబ్బ కు చేరుకుంటారు. అమ్మవారికి దున్నపోతులు, గొర్రెలు, మేకలు, కోళ్లను బలిఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇవి ఎన్ని బలి ఇచ్చినా... అమ్మ వారికి మాత్రం బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 14 , 2026 | 12:01 AM