RJD: ఐసీడీఎస్ కార్యాలయంలో ఆర్జేడీ విచారణ
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:12 AM
స్థానిక ఐసీడీఎస్ ప్రా జెక్టులో గతంలో పనిచేస్తున్న సీడీపీఓ, మరో ఓట్‌సోర్సింగ్ ఉద్యోగిపై వ చ్చిన ఆరోపణలపై శుక్రవారం అర్జేడీ రోహిణి విచారణ చేపట్టారు. కా ర్యాలయంలో అంగనవాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందితో వారిపై విచా రణ జరిపారు.
ధర్మవరం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐసీడీఎస్ ప్రా జెక్టులో గతంలో పనిచేస్తున్న సీడీపీఓ, మరో ఓట్‌సోర్సింగ్ ఉద్యోగిపై వ చ్చిన ఆరోపణలపై శుక్రవారం అర్జేడీ రోహిణి విచారణ చేపట్టారు. కా ర్యాలయంలో అంగనవాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందితో వారిపై విచా రణ జరిపారు. గతంలో పనిచేసిన సీడీపీఓ లక్ష్మి, కో ఆర్డీనేటర్ నరేం ద్రరెడ్డి విధి నిర్వహణలో వ్యవహరిస్తున్న తీరుపై, అవినీతి,అక్రమాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు అందాయి. దీంతో ఆర్జేడీ ధర్మవరానికి చేరుకుని లోతుగా విచారణ చేపట్టారు. పలు విషయాలపై వారితో రాతపూర్వకంగా రాయించుకున్నట్టు సమాచారం. .అదేవిధంగా గతంలో పనిచేసిన సీడీపీఓ అవినీతి అక్రమాలు పాల్ప డ్డారని ఆమెను సస్పెండ్ చేయాలని ఐసీడీఎస్ కార్యాలయంలో విచార ణ జరుగుతున్న సమయంలో విద్యార్థిసంఘాలనాయకులు నాగార్జున, హరి, సురేశ డిమాండ్ చేస్తూ గేటుకు వినతిపత్రాన్ని అతికించారు.
ఐసీడీఎస్ పీడీపై విచారణ
పుట్టపర్తిరూరల్: జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు డైరక్టర్ ప్రమీలపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆర్జేడీ రోహిణి విచా రణ చేపట్టారు. ఇద్దరు సీడీపీఓలు, కాంట్రాక్టర్లు, రాజకీయపార్టీల నా యకులతో కుమ్మక్కై పీడీ అవినీతికి పాల్పడ్దారని ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేరుడంతో ఆర్జేడీ శుక్రవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. తనకు అందిన వి షయాలను పై స్థాయి అధికారులకు నివేదిస్తానని ఆర్జేడీ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....