Share News

SHIVARATHRI :హరహర... మహాదేవ..!

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:03 AM

మహా శివరాత్రిని పు రస్కరించుకున్ని ఆదివా రం శివాలయాలు కిటకి టలాడాయి. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆల యాల్లో బారులు తీరారు. ధర్మవరం పట్టణంలోని శి వాలయాలతో పాటు చె న్నకేశవ, మార్కండేయ స్వామి, లోనికోట చౌడే శ్వరీ ఆలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

SHIVARATHRI :హరహర... మహాదేవ..!
Kalyanotsava of Shiva Parvati at Umamaheswara Temple in Kothapet, Dharmavaram

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెటవర్క్‌)

మహా శివరాత్రిని పు రస్కరించుకున్ని ఆదివా రం శివాలయాలు కిటకి టలాడాయి. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆల యాల్లో బారులు తీరారు. ధర్మవరం పట్టణంలోని శి వాలయాలతో పాటు చె న్నకేశవ, మార్కండేయ స్వామి, లోనికోట చౌడే శ్వరీ ఆలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కొత్త పేట ఉమామ హే శ్వర ఆలయంలో శివపా ర్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కాలభైరవ స్వామి ఆలయంలోనూ పూ జలు చేశారు. శివానగర్‌ శివాలయం ఆధ్వర్యంలో ఉదయం మడుగుతే రును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ హరీశబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్‌, కూటమి నాయకులు లాగారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభించిన రథోత్సవంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కదిరి పట్టణంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా ని ర్వహించి, అమ్మవారు, స్వామి ఉత్సవ విగ్రహాలను తిరువీధుల్లో పల్లకిలో ఊరేగించారు. కొత్తచెరువు మండలంలోని నాగులకనుమ, మరువ ఆంజనేయస్వామి ఆలయాల్లో శివ పార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వి హంచారు. అమడగూరు, గాండ్లపెంట, నల్లచెరువు, నల్లమాడ తదతర మండలాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకల్లు మండలపరిధిలోని కనసానివారిపల్లి సమీపంలోని కనుమలో బైరానిగుట్ట వద్ద వెలసిన భైరవస్వామిని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2026 | 12:03 AM