KAMALANANDA: హిందువులు సంఘటితం కావాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:59 PM
హిందువులందరూ సంఘటితమైతే భారతదేశానికి తిరుగుండదని కమలానందభారతీ సరస్వతిస్వామి అన్నారు. స్థానిక శివాలయం వీధిలో ఉన్న షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.
తాడిపత్రి, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): హిందువులందరూ సంఘటితమైతే భారతదేశానికి తిరుగుండదని కమలానందభారతీ సరస్వతిస్వామి అన్నారు. స్థానిక శివాలయం వీధిలో ఉన్న షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా ఆయనను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం వేదభూమిలో జన్మించడం అంటే ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలని అన్నారు. భారతదేశం అంతా తిరుగుతూ హిందూ సమ్మేళనం చేపడుతున్నామన్నారు. 85 వేల ప్రాంతాల్లో సమ్మేళనం ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో 174 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశ సంస్కృతి మాత్రమే నిలబడిందన్నారు. హిందూ సమ్మేళన అధ్యక్షుడు రమే్‌షనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 4వేల సంవత్సరాల నుంచి విదేశీయులు భారతదేశంపై దాడిచేసి పరిపాలించినా హిందూ సంస్కృతి చెక్కుచెదరలేదంటే హిందూ సమాజం ఎంత గొప్పదో గుర్తుంచుకోవాలన్నారు. మూడు సంవత్సరాల మంచికంటి అనిత శ్రీకృష్ణ వేషధారణలో అందరిని ఆకట్టుకొని భగవద్గీత పారాయణం చేసింది. సమ్మేళన సభ్యులు వెంకటరామిరెడ్డి, కత్తి రామచంద్రారెడ్డి, చిరంజీవులు, ప్రతా్‌పరెడ్డి, అంకాల్‌రెడ్డి, కృష్ణ, సౌమ్య, శింగరి లక్ష్మీనారాయణ, మార్కెట్‌యార్డు చైర్మన భూమా నాగరాగిణి, జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు కదిరి శ్రీకాంతరెడ్డి పాల్గొన్నారు.