Share News

పెద్దారెడ్డి.. ఎక్కడికొస్తావో.. రా..

ABN , Publish Date - Jan 22 , 2026 | 10:49 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిది నెలకొంది. అలాగే పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.

 పెద్దారెడ్డి.. ఎక్కడికొస్తావో.. రా..

- కేతిరెడ్డి సవాలు.. టీడీపీ నేతల ప్రతి సవాలు

- తాడిపత్రిలో ఉద్రిక్తతలు.. పోలీసులు అప్రమత్తం

తాడిపత్రి(అనంతపురం): మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Peddareddy) వ్యాఖ్యలు, టీడీపీ వర్గీయుల ప్రతిసవాళ్లతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత కనిపిస్తోంది. ‘తాడిపత్రి అభివృద్ధిపై మాట్లాడేందుకు అనంతపురం టవర్‌క్లాక్‌, కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్‌.. ఎ క్కడికైనా రా..’ అని వారం క్రితం జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పెద్దారెడ్డి సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు మండిపడ్డారు. ‘అక్కడికెక్కడికో ఎందుకు? భగత్‌సింగ్‌ నగర్‌లో ఉన్న పెద్దారెడ్డి బురుజు వద్దకు వచ్చి సవాల్‌ స్వీకరిస్తాం’ అని ప్రతి సవాలు విసిరారు.


pandu1.2.jpg

మరోవైపు పెద్దారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దారెడ్డి, ఆయన అనుచరులపై గురువారంలోపే కేసులు నమోదు చేయకపోతే 23న ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో 23వ తేదీన టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రి(Tadipatri)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి జిల్లా అధికారులను సంప్రదించి, కిందిస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించారని తెలిసింది.


భయాందోళనల్లో ప్రజలు

పెద్దారెడ్డి, టీడీపీ నేతల సవాళ్ల నేపథ్యంలో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భగత్‌సింగ్‌ నగర్‌, సంజీవ నగర్‌ ప్రజలకు టెన్షన్‌ పట్టుకుంది. తాడిపత్రికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2026 | 10:49 AM