MLA ASMITH REDDY: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:55 PM
తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో ఆయన కష్టపడిన కార్యకర్తలకు మెమెంటోలను అందజేశారు.
తాడిపత్రి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో ఆయన కష్టపడిన కార్యకర్తలకు మెమెంటోలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ టీడీపీఈ క్రమశిక్షణకు మారుపేరు అని, మనమందరం పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో బాగా పనిచేసిన కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించిందన్నారు. వీరందరిని ఎమ్మెల్యే అభినందించారు.
క్రికెట్ టోర్నీ పనుల పరిశీలన
పట్టణంలో 6 నుంచి 14వతేదీ వరకు జేసీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. ఆయన జూనియర్ కళాశాల ఆవరణలో పోటీలు ఏర్పాటుచేయడంతో వాటి పనులను శనివారం పరిశీలించారు. టోర్నమెంట్‌కు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాటుచేయాలని సూచించారు.