Share News

MINISTER: భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యం : మంత్రి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:12 AM

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆయన ఆదివారం మండల పరిధిలోని సంకేపల్లి సమీపంలోని వీర నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

MINISTER: భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యం : మంత్రి
Minister Satyakumar Yadav inaugurating CC Road

- రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

ముదిగుబ్బ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆయన ఆదివారం మండల పరిధిలోని సంకేపల్లి సమీపంలోని వీర నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు సౌకర్యవంతంగా ఆలయానికి చేరుకునే విధంగా రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 16 , 2026 | 12:12 AM