DOCTOR: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో వికాసం
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:09 AM
ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు.
- మలేరియా విభాగం జిల్లా అధికారి
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు. నులిపురుగుల నివారణ దినం సందర్భంగా రాయదు ర్గం కేజీబీవీ, ఆవులదట్ల ఉన్నత పాఠశాల, అంగనవాడీ కేంద్రాల్లో విద్యార్థులకు చేపట్టిన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్ర నేల వీధి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు వేశారు. మున్సిపల్ మున్సిపల్ చైర్మన గౌతమి, ఆర్డీవో వసంతబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, తహసీ ల్దార్ భాస్కర్, ఇనఛార్జ్ డీఎంహెచవో పూజారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బెళుగుప్ప ఉన్నత పాఠశాల, బొమ్మనహాళ్ మండలపరిధి లోని దేవగిరిక్రాస్, కురవళ్లి, చంద్రగిరి పాఠశాలల్లో, బ్రహ్మసముద్రం మండలంలోని కేజీబీవీ పాఠశాల, పుట్టూరు మండలంతో పాటు గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి నియో జక వర్గాల వ్యాప్తంగా మంగళవారం పాఠశాలలు, అంగనవాడీ కేంద్రాల్లో నులిపురుగు నివారణ మాత్రలను పిల్లలకు వేశారు. అరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....