Home » Rayadurg
దహనం వెబ్ సిరీస్ అంశంలో ఆర్జీవీపై అంజనాసిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్‌లో అంజనాసిన్హా పేరు ప్రస్తావించారు. అంజనాసిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవీ ప్రస్తావించారు.
ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని మాల్యం గ్రామంలో వెలసిన కల్లేశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మండలంలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాకులు సిలిండర్ ధర మీద అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గృహ వినియోగం కోసం సరఫరా చేసే సిలిండర్లను కమర్షియల్ కోసం వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లేనిదే ఇంట్లో ఎలాం టి పనులు జరగవు.
మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని శనివారం టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులతో కలిసి ప్రారంభించారు.
రైతుల అవసరాలకు అ నుగుణంగా యూరియా అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతుకు రెండే బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నా, వారికి సరపడా ఎరువులను అందించడంలో జిల్లా అధికార యం త్రంగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Women Suicide: ఈనెల 22న సాయంత్రం ఆరు గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు యువతి తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే రాత్రి గడిచినప్పటికీ అనూష ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నదాత అవసరాలకు అనుగుణంగా మండలానికి 50 రైతు రథాలు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విన్నవించారు. అసెంబ్లీలో సోమవారం రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు.
వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. పట్టణానికి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుమారం రేపింది. రాయదుర్గం వైసీపీలో ఇటీవల అసమ్మతి బ లపడుతూ వస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా రెం డువర్గాలుగా విడిపోయి, తన్నుకునే స్థాయికి చేరారు.
హంద్రీనీవాలో అంతర్భాగమైన 36సి (ఆవులదట్ల ఉపకాలువ) ప్యాకేజీ పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. హంద్రీనీవా పనుల కోసం 2021 జూన 7న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 29 మేరకు రూ.6,124 కోట్ల పాలనా ఆమోదం పొందిందని అన్నారు. ఆ నిధులు అందుబాటులో ఉన్నందున తిరిగి పాలన, ఆర్థిక ఆమోదంతో ...
రాయదుర్గం ప్యాలెస్ రోడ్లో ఓ కార్పోరేట్ కంపెనీ ‘ఉచిత చికెన శిబిరం’ నిర్వహించింది. చికెన వంటకాలు, ఉడికేసిన కోడిగుడ్లను పంపిణీ చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన కొనుగోళ్లు పడిపోవడంతో ‘ఏమీ కాదు.. కావాలంటే తిని చూడండి’ అన్నట్లు అవగాహన కల్పించింది....