WHIP KALAVA : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:55 PM
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఉదయం బీటీ ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందించిన 10.30 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు.
గుమ్మగట్ట, డిసెంబరు, 27(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఉదయం బీటీ ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందించిన 10.30 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు. ఆయన మాట్టాడుతూ గతంలో మత్స్యకారులకు అందించే 6.40 చేప పిల్లలు సరఫరా జరిగేవని ప్రస్తుతం వాటిని 10.30 లక్షలకు పెంచామన్నారు. మత్స్యకారులకు 20 కోట్ల మేర ఆదాయం లభిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కోసం పలు సంక్షేమ పథకాల అమలు చేస్తూ సీఎం చంద్రబాబు ముందుకెళుతున్నారన్నారు. రెండేళ్లుగా రిజర్వాయర్ సమృద్ధిగా వరద నీరు చేరడంతో పంటల పండించుకోవడంతోపాటు మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడుతోందని అన్నారు. కళ్యాణదుర్గం ఆర్డీవో వసంతబాబు, కర్నూలు ఏడీ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఓ అసీఫ్, టీడీపీ మండల కన్వీనర్ సన్నన్న, మాజీ కన్వీనర్ నిర్మలప్ప, బీటీ ప్రాజెక్టు చైర్మన కాలవ రాజు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బెస్త శ్రీరాములు, కార్యదర్శి సత్యనారాయణమూర్తి, సూరి, రాజు, సంజీవ పాల్గొన్నారు.
కోట్ల నరేగా నిధులతో రోడ్ల అభివృద్ధి: ఏడాదిన్నర కాలంలో రూ.30 కోట్ల నరేగా నిధులతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం పట్టణంలోని 9వ వార్డు తారాజిన్నా వద్ద, మల్లాపురం గ్రామపరిధిలో ఉన్న రామకృష్ణ వృద్ధాశ్రమం వద్ద సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోనే రూ.18.85 కోట్ల పనులను చేపట్టామని, పల్లె పండుగ-2 కింద రూ.8.31 కోట్ల పనులు చేస్తున్నామన్నారు. వీటితో పాటు రూ.2.70 కోట్ల ఖర్చుతో అదనంగా రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. పద్మశాలి కార్పొరేషన డైరెక్టర్ పొరాళ్లు పురుషోత్తం, మండల కన్వీనర్ హనుమంతు పాల్గొన్నారు.