WHIP: ఆలయాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:23 AM
ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని మాల్యం గ్రామంలో వెలసిన కల్లేశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కణేకల్లు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని మాల్యం గ్రామంలో వెలసిన కల్లేశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొదటగా ఆలయ ధర్మకర్తగా విజయ్‌ను ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం విప్ మాట్లాడుతూ 2016లో మంత్రిగా ఉన్నపుడు ఆలయ జీర్ణోద్ధరణకు రూ.45 లక్షల నిధులను అందించామన్నారు. తిరిగి ఇప్పుడు విప్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాక పాలకవర్గ ప్రమాణోత్సవానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎపుడూ ముందుంటుందన్నారు. సనాతన ధర్మాన్ని పాటించడంతో పాటు దాన్ని కాపాడడం కూడా తమ బాధ్యతగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవదాయ ఇనస్పెక్టర్ రాణి, ఈఓలు దేవదాసు, బాబు, టీడీపీ నాయకులు లాలెప్ప, ఆది, వేలూరు మరియప్ప, కళేకుర్తి సుదర్శన, వన్నారెడ్డి, బీటీ రమేష్, ఎంపీటీసీ నరేంద్ర, అనిల్, జయరాంచౌదరి, రఘునాథ్, నాగరాజు, చాంద్‌బాషా, మారుతి, ప్రభాకర్, శరభనగౌడ్, అశోక్, యువరాజ్, సూరి, హరి, నరేష్, మాబు, ఎల్లప్ప, వండ్ర పాల్గొన్నారు.