SRI SHAKTHI: స్త్రీ శక్తి పథకం ప్రారంభం
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:06 AM
మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని శనివారం టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులతో కలిసి ప్రారంభించారు.
బెళుగుప్ప, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని శనివారం టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అనంతపురం వెళ్లే ఆర్టీసీ బస్సుకు తోరణాలు కట్టి ప్రారంభించారు. సూపర్ సిక్స్ హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కంచి రాముడు, ఎస్‌ఎంసీ చైర్మన రుద్రయ్య ధనుంజయరెడ్డి, నారాయణస్వామి, అనిల్, ధనుంజయ, అంగడి శ్రీరాములు, ఈరన్న పాల్గొన్నారు.