Share News

URIEA: ఒక రైతుకు రెండే బస్తాలు..!

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:02 AM

రైతుల అవసరాలకు అ నుగుణంగా యూరియా అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతుకు రెండే బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నా, వారికి సరపడా ఎరువులను అందించడంలో జిల్లా అధికార యం త్రంగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

URIEA: ఒక రైతుకు రెండే బస్తాలు..!
Farmers who came for urea in Uddehal

ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలైనా అందని వైనం

ఇబ్బంది పడుతున్న అన్నదాతలు

బొమ్మనహాళ్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రైతుల అవసరాలకు అ నుగుణంగా యూరియా అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతుకు రెండే బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నా, వారికి సరపడా ఎరువులను అందించడంలో జిల్లా అధికార యం త్రంగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కొరతకు జిల్లా అధికార యంత్రంగం నిర్లక్ష్యాం, అలసత్వమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు శ్రమను వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రేషన విధానంలో సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌ కార్డు బట్టి ఒక్కో రైతులకు రెండూ బస్తాలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. బొమ్మనహాళ్‌ మండలంలోని బండూరు, బొమ్మనహళ్‌, ఉద్దేహాళ్‌, ఉంతకల్లు, గోనేహాళ్‌ రైతు సేవ కేంద్రాలకు గురువారం 63 టన్నులు (1400) బస్తా లు వచ్చాయని, ఒక రైతుకు రెండు బస్తాలతో పంపిణీ చేసినట్లు ఏవో సాయికుమార్‌ తెలిపారు. రైతు సేవా కేంద్రాలకు లోడును బట్టి రైతులకు సరఫరా చేస్తున్నామని ఆధార్‌ కార్డు ఆధారంగా ఒక రైతుకు రెం డు బస్తాల చొప్పున ఇస్తున్నామన్నారు. యూరియా మరింత వస్తుందని అందోళన చెందల్సిన అవసరం లేదని రైతులకు తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది. మండలంలో వరిసాగు ఎక్కువగా ఉంటుందని జిల్లా అధికారులకు తెలుసుకోవడంలో విఫలమయ్యారని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన ప్రారంభమై రెండు నెలలు పూర్తి అవుతున్నా యూరియా సరఫరా చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:02 AM