Share News

RGV Legal Case: రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

ABN , Publish Date - Sep 18 , 2025 | 10:07 AM

దహనం వెబ్‌ సిరీస్‌ అంశంలో ఆర్జీవీపై అంజనాసిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్‌ సిరీస్‌లో అంజనాసిన్హా పేరు ప్రస్తావించారు. అంజనాసిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవీ ప్రస్తావించారు.

RGV Legal Case: రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
RGV Legal Case

హైదరాబాద్‌, సెప్టెంబర్ 18: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై (Director Ramgopal Varma) కేసు నమోదు అయ్యింది. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గంలో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దహనం వెబ్‌ సిరీస్‌ అంశంలో ఆర్జీవీపై అంజనాసిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్‌ సిరీస్‌లో అంజనాసిన్హా పేరు ప్రస్తావించారు. అంజనాసిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.


దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండా పేరు వాడినందుకు ఆర్జీవీపై రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. కాగా.. 2022, ఏప్రిల్ 14న దహనం వెబ్ సిరీస్ విడుదలైంది. ఆర్జీవీ నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ దహనం. ఈ మూవీకి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. కమ్యూనిస్ట్ నేత హత్య, దానికి కొడుకు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడో ఈ కథ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకులు.


ఇవి కూడా చదవండి..

జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్

మాజీ ముఖ్యమంత్రులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 10:52 AM