CPI Narayana: మాజీ ముఖ్యమంత్రులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:12 AM
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ సీఎం జగన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖర్ రావులు అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
పల్నాడు: తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు అసెంబ్లీకి రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మాజీ సీఎంలు అసెంబ్లీకి ముఖం చూపించిన దాఖలాలే లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన.. ప్రజా సమస్యల తరఫున వారు మాట్లాడక పోవడంతో.. నియోజకవర్గ ప్రజల్లో నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
అయితే.. ఏపీలో మాజీ సీఎం జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ.. భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదాకు ఉన్న నియమ నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మరోపైపు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ తన అనారోగ్య సమస్యల వల్ల అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నానని.. కాలం గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ సీఎం జగన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖర్ రావులు అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీకీ రాకపోవడం అంటే.. మీకు ఓటు వేసిన ప్రజానీకాన్ని మోసం చేయటడమే అని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలంటే కొన్ని లెక్కలు వుంటాయని.. అవేవి తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి అధికారం వస్తే అసెంబ్లీకి వస్తారు.. లేకపోతే ముఖం చాటేస్తారా అని నిలదీశారు. అధికారం ఉన్న లేకపోయినా అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి రాకపోవటం అంటే.. పెళ్లి చేసుకుని కాపురానికి రాకపోవటమే అని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..