Share News

Atchannaidu Slams Jagan: జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్

ABN , Publish Date - Sep 18 , 2025 | 09:23 AM

11 సీట్లు వచ్చిన పార్టీ నేతలు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే గూబ పగలగొట్టాలి అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో ... జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పు అని అన్నారు.

Atchannaidu Slams Jagan: జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్
Atchannaidu Slams Jagan

అమరావతి, సెప్టెంబర్ 18: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మంత్రి అచ్చెన్నాయుడు (Minister Acha తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం పట్ల మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్ చెంప పగలగొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు వచ్చిన పార్టీ నేతలు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే గూబ పగలగొట్టాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో ... జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పు అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీలో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని.. అది స్పీకర్ పరిధిలోని అంశమని వెల్లడించారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి అంటూ అచ్చెన్నాయుడు హితవుపలికారు.


జగన్, వైసీపీ నేతలు బావిలో దూకాలి: పంచుమర్తి

panchumarthi-anuradha.jpg

వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్, వైసీపీ నేతలు బావిలో దూకాలంటూ మండిపడ్డారు. పోలవరం కట్టనందుకు జగన్ బావిలో దూకాలన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి సమాధానం వినకుండా సభ నుంచి పారిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని సజ్జల కూటమిపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు బయట ఉండి పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తే సహించమని.. సభకు వచ్చి మాట్లాడాలని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మాజీ ముఖ్యమంత్రులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి ఆర్జిత సేవల డిసెంబరు కోటా నేడు విడుదల

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 10:58 AM