TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:28 AM
ఈనెల 24 నుంచి ప్రారంభం కాను న్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడును టీటీడీ ఆహ్వానించింది.
సీఎంకు టీటీడీ చైర్మన్, ఈవో ఆహ్వానం
తిరుమల, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): ఈనెల 24 నుంచి ప్రారంభం కాను న్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. బుధవారం ఉదయం వెలగపూడిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యురాలు జానకిదేవి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భం గా సీఎంకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. వేదపండితులు ఆశీర్వచనం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.