CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:04 AM
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన తలారి గౌతమి సోమశేఖర్ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.
కళ్యాణదుర్గం రూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన తలారి గౌతమి సోమశేఖర్ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు వంటి మౌలిక సమస్యలపై ప్రజలు అధికారులకు తెలియజేశారు. సమస్యల ను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి, ప్రకాష్, రామాంజినేయులు, ప్రియాంక, కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....