Share News

WIRES: ప్రమాదకరంగా విద్యుతతీగలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:00 AM

విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్‌నాయక్‌, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు.

WIRES: ప్రమాదకరంగా విద్యుతతీగలు
Villagers pointing to electric wires on tree branches

రాయదుర్గంరూరల్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్‌నాయక్‌, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు. మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో అనంతపురం - రాయదుర్గం జాతీయ రహదారి పక్కన... గ్రామం లోని బస్టాప్‌ నుంచి చర్చి వద్ద నివాస గృహాలకు విద్యుత సరఫరా కోసం గతంలో ఎల్‌టీలైన ఏర్పాటు చేశారు. అయితే అక్కడ చెట్లు ఏపుగా పెరగడంతో పాటు వైర్లు తెగి చెట్ల కొమ్మలపై పడ్డాయి. మేకలు మేత కోసం వెళ్లి విద్యుతషాక్‌కు గురై మృతి చెందిన సంఘటనలు జరిగాయి. సమస్య పరిష్కరించమని పదే పదే విద్యుతశాఖ అధికారులను కోరినా వారు పటి ్టంచుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎల్‌టీలైన తీగలను స్తంభాల పైకి లాగి, ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 18 , 2026 | 12:00 AM