Share News

FESTIVAL: వైభవంగా రథోత్సవాలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:53 PM

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో వెలసిన ఎణ్ణే రంగనాథేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం అంగరం గ వైభవంగా సాగింది. ఆలయంలో ఉదయం స్వామికి పంచామృతాభి షే కం చేసి పుష్పాలంకరణ చేశారు.

FESTIVAL:  వైభవంగా రథోత్సవాలు
Rathotsavam at Govindavada

బొమ్మనహాళ్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిం దవాడ గ్రామంలో వెలసిన ఎణ్ణే రంగనాథేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం అంగరం గ వైభవంగా సాగింది. ఆలయంలో ఉదయం స్వామికి పంచామృతాభి షే కం చేసి పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ క మిటీ ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఉంచారు. ఆలయం నుంచి ఎదురు బసవన్న గుడి వరకు రథాన్ని లాగారు. మండలంలోని దర్గాహొన్నూరు, కళ్లుహోళ, కళ్లుదేవనహళ్లి, తార్కాపురం గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు.


ఎస్‌ఐ నబీరసూల్‌ బం దోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమ నాథ్‌గౌడ్‌, ఎస్‌జీ వన్నూరుస్వామి, సాగునీటి సంఘం అధ్యక్షుడు సుంక న్న, రాతింటి వన్నూరుస్వామి, సాగునీటి సంఘం అధ్యక్షులు సుంకన్న, రాతింటి వన్నూరుస్వామి, బంగి లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వజ్రకరూరు(ఉరవకొండ): వజ్రకరూరు మండల పరిధిలోని తట్రగ ల్లు గ్రామంలో వీరభద్ర స్వామి రథోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది.


సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై ఉంచి, రథాన్ని ఆలయం నుంచి ఎదురు బసవన్న గుడి వరకు లాగి, యథాస్థానానికి చేర్చారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

డీ. హీరేహాళ్‌: మండలంలోని పూలకుర్తి గ్రామం లో జంబన్న తాత రథోత్సవాన్ని మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఆలయంలో ఉదయం మూలవిరాట్టుకు అభిషేకం చేసి, విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి భారీ జనసందోహం మధ్య లాగారు. వివిధ ప్రాంతల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 17 , 2026 | 11:53 PM