PACS: పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:59 PM
పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణంలో సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవా రం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు, ప్రజలకు డా క్టర్ వినీత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఉరవకొండ, జూలై 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణంలో సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవా రం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు, ప్రజలకు డా క్టర్ వినీత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన ప్యారం కేశవానంద మాట్లాడుతూ సహకార సంఘం బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు నాగేంద్రప్ప, నాగప్రమీళ, ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఉమాపతి, సీఈ వో మహ్మద్‌గౌస్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా వజ్రకరూరులో సహకార వారోత్సవాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వ హించారు. పీఏసీఎస్ చైర్మన వలి, సీఈవో సతీష్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన నజీర్, సిబ్బంది పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం: కంబదూరు సహకార సంఘం అధ్యక్షుఢు అచ్చంపల్లి బాబయ్య ఆధ్వర్యంలో బుధవారం సహకార సంఘం కార్యాలయంలో బుధవారం సహకార సంఘం వారోత్సవాలను నిర్వ హించారు.
అందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి పలువురికి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆడిటర్ శ్రీనివాసులు, సహకార సంఘం కార్యదర్శి ముత్యాలప్ప, వైద్యాధికారిణి లీలావతి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెళుగుప్ప: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సహకార సంఘం వారోత్సవాల్లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి నట్లు అధ్యక్షుడు కంచిరాముడు, మానిటరింగ్ అధికారి కృష్ణవేణి తెలిపారు. డాక్టర్ ప్రియాంక, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గుమ్మఘట్ట: మండలంలోని కలుగోడు, గొల్లపల్లిల్లో బుధవారం సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. కలుగోడు వైద్య శిబిరంలో టీడీపీ మండల కన్వీ నర్ కాలవ సన్నన్న, సహకార సంఘం అధ్యక్షుడు కంటి తిమ్మప్ప, బీటీపీ చైర్మన కాలవరాజు, సొసైటీ సీఈవో శ్రీనివాసులు, వైద్యాధి కారి సందీప్, సూపర్‌వైజర్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....