Share News

MLA: వృద్ధులను ఆదుకుంటున్న చంద్రబాబు

ABN , Publish Date - Jul 01 , 2026 | 11:52 PM

అవ్వ, తాతలకు పెద్ద కొడుకుగా, వితంతువులకు అన్నగా నిలుస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రూ. వేల కోట్లను పింఛన రూపంలో అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.

MLA: వృద్ధులను ఆదుకుంటున్న చంద్రబాబు
MLA Gummanuru distributing pensions to beneficiaries.

- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుత్తి, జూలై 1(ఆంధ్రజ్యోతి): అవ్వ, తాతలకు పెద్ద కొడుకుగా, వితంతువులకు అన్నగా నిలుస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రూ. వేల కోట్లను పింఛన రూపంలో అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని 18వ వార్డు ఆశానగర్‌లో బుధవా రం ఎన్టీఆర్‌ భరోసా పింఛన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి అవ్వ, తాతలకు పింఛన పంపిణీ చేశారు.

బాధితుడికి పరామర్శ: పేద కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని 18వ వార్డులో నివాస మున్న నాగశేఖర్‌ అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.5లక్షల చెక్కును బుధవారం బాధితుడి ఇంటికి వెళ్లి అందజేశారు. ఆయన నాగశేఖర్‌తో మాట్లాడుతూ వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ ఽఽధైర్య పడవద్దని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బర్‌ మీయా, టీడీపీ పట్టణ కన్వీనర్‌ ఎంకే చౌదరి, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన శ్రీనివాసులు, రమేష్‌, న్యాయవాది సోమశేఖర్‌, రామకృష్ణ, కొనంకి కృష్ణ, టైలర్‌ బాష, తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 01 , 2026 | 11:52 PM