MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:14 AM
తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.
కణేకల్లు, జూలై 2(ఆంధ్రజ్యోతి): తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు. కాగా ఈ సమావేశం ఎంపీటీసీ సభ్యులకు చివరిది కావడంతో సభ్యులు తమ ఆవేదన వెళ్లగక్కారు. వైస్ ఎంపీపీ లీలావతి మాట్లాడు తూ ప్రతి మండల సమావేశంలో తాము ఏ సమస్య తెచ్చినా పరిష్కరి స్తాం, చేసేస్తామంటూ ఆయా శాఖల అధికారులు మాట లు చెప్పారే తప్ప ఏ పనీ పూర్తి చేస్తాం అంటూ ఒక్క అధికారి కూడా చెప్పలేద న్నా రు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తమ దృష్టికి ప్రజలు తెచ్చిన సమ స్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల విఫలమయ్యామని బాధపడ్డారు.
అలాగే హనుమాపురం టీడీపీ ఎంపీటీసీ నరేంద్ర మాట్లా డుతూ పలు శాఖల అధికారులు సమస్యల పరిష్కారంలో పూర్తిగా నిర ్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికైనా శ్రద్ధ చూపాలని కోరారు. ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఎంపీపీ వండ్రయ్య, డిప్యూటీ ఎంపీడీవోలు షేక్షావలి, చంద్రమౌళి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉరవకొండ: పట్టణంలోని మండల పరిషత కార్యాలయ సమావేశ భవనంలో గురువారం నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎంపీపీ నరసింహులు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. పలు సమస్యలపై అధికారులను సభ్యులు నిలదీశారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ సభ్యుడు వన్నూర్‌స్వామి సమావేశంలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని, శివరామిరెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డి మాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నా, అరికట్టడంలో విద్యాశాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవిప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో సతీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....