Share News

CAMERA: పనిచేయని సీసీ కెమెరాలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:49 PM

స్థానిక ఆర్టీసీ బ స్టాండ్‌ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.

CAMERA: పనిచేయని సీసీ కెమెరాలు
Non-functional CCTV camera at the RTC bus stand.

బస్టాండ్‌లో పెరిగిన చోరీలు - ప్రయాణికుల్లో ఆందోళన

గుంతకల్లు టౌన, జూలై 2(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బ స్టాండ్‌ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు. కొన్ని సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లు చెడిపోయాయి. పర్యవవేక్షిం చాల్సిన పోలీసులు బస్టాండ్‌లో కనిపించడం లేదని ప్రయాణికులు వా పోతున్నారు. ఈ బస్టాండ్‌లో ప్రతి రోజు అనంతపురం, బెంగళూరు, ఆ దోని, హైదరాబాదుకు వెళ్లే వందల మంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటారు. అయితే దొంగలు ప్రయాణికుల బ్యాగులు, లాప్‌ టాప్‌లు, సెల్‌ఫోన్లు, పర్సులు, హ్యాండ్‌ బ్యాగులు, ఇతర విలువైన సా మాన్లను దొంగలిస్తున్నారు. మే 28న అనంతపురానికి చెందిన మహిళ బ్యాగ్‌లో ఉన్న సెల్‌ఫోన, ఏటీఎం కార్డులను ఎత్తుకెళ్లారు. ఈ నెల 25న బస్సు ఎక్కుతున్న మహిళ మెడలో తాళిబొట్టుకు ఉన్న రెండున్నర తు లాల పలకలు, గుండ్లు లాక్కె ళ్లారు. పది రోజుల క్రితం ఓ ఉపాధ్యా యుడు పర్సు అపహరించారు. ఇక ప్రతి రోజూ సెల్‌ఫోన్లు, పర్సులు చోరీ అవుతున్నాయి. బాధితులకు కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చే స్తున్నారు. మరికొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని అంటున్నారు.


ఇప్పటికైనా బస్టాండ్‌లో పోలీస్‌ గస్తీ పెంచి చోరీల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. దొంగతనాలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవ డంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. సీసీ టీవీ ఫుటేజీ ద్వా రా దుండగులను గుర్తించడం సులువుగా ఉంటుంది. వీటి ఆధారంగా గతంలో జరిగిన పలు కేసుల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఏదైనా జరిగితే పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

గస్తీ పెంచుతాం- టూటౌన సీఐ వంశీకృష్ణ

ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీల నివారణకు గస్తీ పెంచుతాం. అక్కడి సీసీ కెమెరాలను ఈనెల 26న సొంత ఖర్చులతో మరమ్మత్తుల చేయించాం. బస్టాండ్‌లో ప్రతి రోజు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్టీసీ అధికారులు కూడా ఆర్టీసీ కానిస్టేబుళ్లు బస్టాండ్‌లో విధులు నిర్వహించేలా చూడాలి. ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు అప్రమ త్తంగా ఉండాలి.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 02 , 2026 | 11:49 PM