TANK: అడుగంటిన ఎస్‌ఎస్ ట్యాంకులు
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:48 PM
మండలంలోని నింబగల్లు వద్ద ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకుల్లో (మూడు చెరువులు) నీటి నిల్వలు అడు గంటాయి. నింబగల్లు ఎస్‌ఎస్‌ట్యాంకు నుంచి ఉరవకొండ పట్టణంతో పాటు ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.
- కాలువకు నీరు వచ్చే వరకు ఉన్న నీటి నిల్వలే దిక్కు
ఉరవకొండ, జూలై 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని నింబగల్లు వద్ద ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకుల్లో (మూడు చెరువులు) నీటి నిల్వలు అడు గంటాయి. నింబగల్లు ఎస్‌ఎస్‌ట్యాంకు నుంచి ఉరవకొండ పట్టణంతో పాటు ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. నీరు తగ్గిపోవడంతో మూడు నెలల నుంచి కేవలం గ్రామాలకు మాత్రమే నీ టిని సరఫరా చేస్తున్నారు. రెండు నెలల కిందటే ఓ ట్యాంకు ఎండి పోయింది. మిగిలిన రెండు ట్యాంకుల్లోని బండలు ట్యాంకులో నీటి మ ట్టం 6మీటర్ల ఉండాల్సి ఉండగా మూడు మీటర్లకు పడిపోయింది. మరో ట్యాంకులో 15 అడుగులకు గాను రెండున్నర అడుగుల నీరు నిల్వ ఉం ది.
దీంతో మండలంలోని నింబగల్లు, రాయంపల్లి, వ్యాసాపురం బూదగవి గ్రామాలకు మాత్రమే వాటి నుంచి నీటిని సరఫరా చేస్తున్నా రు. ప్రస్తుతం ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి సగం నీటిని మాత్రమే పంపింగ్ చేస్తున్నారు. ఉరవకొండకు నీటి సరఫరాను ఆపివేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు కురవకపోవడంతో తుంగభద్రా డ్యాం నుంచి కాలువకు నీరు చేరేందుకు ఆలస్యం అయ్యే అవకాశముంది. ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీరే దిక్కు.
ముందస్తు చర్యలు చేపడితేనే...
అధికారులు మందస్తు చర్యలు చేపట్టి, ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీటిని పొదుపుగా వాడు కోవాల్సి ఉంటోంది. గ్రామాల్లో నీటికి ఇబ్బందులు కలుగకుండా ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. అదేవిధంగా పంచా యతీ పథకాలు, సత్యసాయి తాగు నీటి పథకాలపైన దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో బోర్ల మర్మత్తులు చేపట్టి వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై ఆర్ డబ్య్లూఎస్ డీఈ సఫ్రీనను వివరణ కోరగా చెరువులో నీటితో పాటు మూడు బోర్ల నుంచి నీటిని వాడుకుంటున్నాం. ఎస్‌ఎస్ ట్యాంకుల ద్వారా గ్రామాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రత్యేక ప్రణాళికతో నీటిని అందిస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....