LIGHTS: వెలగని హైమాస్ట్ లైట్లు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:01 AM
పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.
ఉరవకొండ, జూలై 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు. ఆ లైట్లు వెలగక పోవడంతో శివారు కాలనీలోని ప్రజలు, జాతీయ రహ దారి గుండా ఉరవకొండలోకి ప్రవేశించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో జాతీయ రహదారి అందకారంలో ఉంటోంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి హై మాస్ట్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....