ROAD: నాడు దుర్భరం-నేడు సౌకర్యం
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:50 PM
మండలంలోని వి. కొత్త కోటకు వెళ్లే దారి పూర్తిగా శిథిలమై గుంతలమయమై ఉండేది. వాహనా ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు రోడ్డు దుస్థితిని మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు.
విడపనకల్లు, జూన 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని వి. కొత్త కోటకు వెళ్లే దారి పూర్తిగా శిథిలమై గుంతలమయమై ఉండేది. వాహనా ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు రోడ్డు దుస్థితిని మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి రోడ్డు ఏర్పాటుకు రూ. 1.30 కోట్లు నిధులు కేటాయించారు. ఆ నిధులతో రోడ్డు పనులు చేశారు. వి. కొత్తకోట వద్ద నుంచి ఉప్పు కొండ వరకు తారు రోడ్డు, అక్కడి నుంచి విడపనకల్లు ఆంజనేయ స్వామి గుడి వరకు సీసీ రోడ్డు వేసి దారి కష్టాలు తీర్చారు. దీంతో వి. కొత్తకోట, విడపనకల్లు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మండలంలోని చాలా రోడ్ల రూపు రేఖలు మారిపోయాయి.
మరుగుదొడ్లకు తలుపులు
కూడేరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో దెబ్బతిన్న బాలికల మరుగుదొడ్ల తలుపులను ఎట్టకేలకు నూతనంగా అమర్చారు. కొంత కాలంగా పాఠశాలల బాలికల మరుగుదొడ్ల తలుపులు దెబ్బతిన్నాయి. దీంతో స్కూల్ కమిటీ చైర్మన రాము, కమిటీ సభ్యులు మరుగుదొడ్ల మరమ్మతులపై స్కూల్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. నాడు- నేడు కింద మిగిలిన నిధులతో దాదాపు రూ. 20 వేల వరకు ఖచ్చు చేసి మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు నూతనంగా తలుపులు అమర్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....