DOCTOR: ఘనంగా డాక్టర్స్ డే
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:08 AM
జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు.
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్), జూలై 1: జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు. ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్ నారాయణ నాయక్, జీఎంబీ చలపతి, ఇన్చార్జి హెచఎం లలితాబాయి తదితరులు పాల్గొన్నారు. అవోపా ఆధ్వర్యంలో వైద్యులు వేల్చూరి ప్రభాకర్, పత్తిహిమబిందు, శ్రీనివాసగుప్త, కేవీవీ సాయిప్రసాద్, జీఎన వెంకటేష్, వేల్చూరి రేణుకను సత్కరించారు. ఈకార్యక్రమంలో అవోపా సంఘం సభ్యులు పాల్గొన్నారు. పామిడి టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రామ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సీహెచసీలో వైద్యాధికారులు డాక్టర్ మహేష్, డాక్టర్ శివకార్తీక్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఉరవకొండ పట్టణం లోని లయన్స క్లబ్ యోగా సెంటర్‌లో వైద్యులు ఎర్రిస్వామిరెడ్డి, హర్ష వర్ధనను సత్కరించారు. లయన్స క్లబ్ అధ్యక్షుడు వేదమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. తాడిపత్రిలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు సత్యప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించా రు. టీచర్స్‌కాలనీలోని సంఘం కార్యాలయంలో విశ్రాంత వైద్యులు పుల్లయ్య, రామలక్ష్మికి ఘన సన్మానం చేశారు. సంఘం సభ్యులు హను మంతరెడ్డి, వీరారెడ్డి, అశ్వత్థరెడ్తి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీహెచఈఓకు సన్మానం
తాడిపత్రి: మండలంలోని చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచఈఓగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మన్నను బుధవారం ఆ పీహెచసీలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి హా జరయ్యారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....