VBGRAMG: వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:11 AM
మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్ రోజ్‌ఘార్ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు.
ఉరవకొండ, జూలై 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్ రోజ్‌ఘార్ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు. నిరుద్యోగ భృతి కోసం మెరుగైన ఏర్పాటన్నారు. అలాగే వజ్రకరూరు చెరువులో వీబీ జీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించారు. ఏపీడీ ఆయేషా, ఎంపీడీవోలు రవి ప్రసాద్, శివనాగజ్యోతి, ఏపీవోలు సుజాత, విమల సిబ్బంది పాల్గొన్నారు.
గుత్తిరూరల్: పేదరిక నిర్మూలనే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన వెంకట శివుడు యాదవ్ పే ర్కొన్నారు. మండలంలోని అబ్బేదొడ్డి గ్రామంలో గురువారం వీబీజీ రామ్‌జీ పథకాన్ని ఆయన ప్రారభించారు. ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, ఏపీవో రమేష్, పీల్డ్ అస్టిసెంట్ నారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు సుధాకర్ నాయుడు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
బొమ్మనహాళ్: మండల వ్యాప్తంగా గురువారం వీబీజీ రామ్ జీ పథాకాన్ని ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలోఎంపీడీవో విజభాస్కర్, ఏపీవో లక్ష్మీకాంత భాయి, సింగల్ విండో ఆధ్యక్షుడు కొత్తపల్లి మల్లికార్జున టీడీపీ నాయకులు ముల్లంగి నారాయణస్వామి, పయ్యావుల అనిల్, పయ్యావుల నాగరాజు, రవిచంద్రసాగర్, తిప్పేస్వామి పాల్గొన్నారు.
శెట్టూరు: మండల వ్యాప్తంగా వీబీజీ రామ్ జీ పథకాన్ని గురు వా రం ప్రారంభించారు.శెట్టూరు పంచాయతీకి సంబంధించి స్థానిక కార్యా లయంలోని సమావేశ భవనంలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని లాంఛ నంగా జ్యోతిని వెలిగించి వైస్ ఎంపీపీ చెవుల క్రిష్టప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిలానీ బాష, తహసీల్దార్ ఈశ్వరమ్మ, ఏపీవో సర్మస్ వలీ తదితరులు పాల్గొన్నారు.
యాడికి: వీబీ-జీ రామ్‌జీ పథకం ప్రారంభోత్సవంపై గురువారం యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురవారం గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో వీరరాజు మాట్లాడుతూ నేటి నుంచి అమలులోకి వచ్చిన బీజీ-జీ రామ్‌జీ పథకంతో గ్రామీణుల జీవనోపాధి పెంపొందుతుందని తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో శశికళ, ఏపీవో మద్దిలేటి, హౌసింగ్ ఏఈ లోకేష్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్, టీడీపీ మండల కన్వీనర్ ఆదినారాయణ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....