PROOF: కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:59 PM
జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
పామిడి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలోని పీ కొండాపురం గ్రామంలో సుమారు 90 బాలసం తు కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధువీకరణ పత్రాలు ఇవ్వాలని గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీఓ మంజూరు చేశారన్నారు.
అయినప్పటికీ మండలంలో తకు కుల దృవీకరణ పత్రాలు అందజేయడం లేదన్నారు. దీంతో తమ కుటుంబాలలోని విద్యార్థులు ఏ కులమో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనకు జనసేనప పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇనఛార్జి వాసగిరి మణికంఠ, బీజేపీ మండల అధ్యక్షుడు అంజినాయక్ చౌహాన, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మా మోహన కృష్ణ మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుళ్లాయప్ప, బాలసంతు రాష్ట్ర కార్యదర్శి శీన, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా దేవి, నాయకులు పసుల లక్ష్మన్న, ఇప్పే నరసప్ప తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....