హౌసింగ్‌లో లోపించిన సమయపాలన
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:27 AM
హౌసింగ్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కనీసం ఆ కార్యాలయ తలుపులు కూడా తెరవని పరిస్థితి నెలకొంది
ధర్మవరం రూరల్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): హౌసింగ్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కనీసం ఆ కార్యాలయ తలుపులు కూడా తెరవని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ పేరు ఉందో లేదోనని... తప్పులకు సవరించుకునేందుకు ధర్మవరంలోని హౌసింగ్ కార్యాలయం వద్దకు వెళ్తున్నారు. అయితే ఆ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో వారు గంటల తరబడి అక్కడ నిరీక్షించి.. సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. మంగళవారం ఆ కార్యాలయాన్ని ఆంధ్రజ్యోతి విజిట్ చేసింది. ఉదయం 11.30 గంటలైనా తాళం కూడా తీయలేదు. మాములుగా అధికారులు కార్యాలయానికి వచ్చి ఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే తాము నేరుగా ఫీల్డ్‌కు వెళ్తున్నట్లు వారు చెబుతున్నారు. దీనిపై హౌసింగ్ డీఈ వెంకటేశ్వర్లను వివరణ కోరగా .. హౌసింగ్ అధికారులు తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి.. ఫీల్డ్‌కు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మవరం మండల ఏఈ ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నారని, పట్టణ ఏఈ పుట్టపర్తికి ఆఫీసు పని నిమిత్తం వెళ్లినట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సిబ్బందిని ముందు కార్యాలయానికి వచ్చి.. ఆ తర్వాతే ఫీల్డ్‌కు గానీ ఇతర పనుల నిమిత్తం వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.