Share News

నాపై వచ్చిన ఫిర్యాదులు పూర్తి అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

ABN , Publish Date - Jul 20 , 2026 | 10:18 AM

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తనను లైంగింకంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ట్రైనీ ఐపీఎస్‌పై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.

నాపై వచ్చిన ఫిర్యాదులు పూర్తి అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Hyderabad News

హైదరాబాద్, జులై 20: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తనను లైంగింకంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ట్రైనీ ఐపీఎస్‌పై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్.. పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘నాపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవం’ అంటూ పోస్ట్ పెట్టారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని.. న్యాయం తప్పక గెలుస్తుందన్నారు. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్ట్ చేయాలంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఉదయ్ కృష్ణారెడ్డి తెలియజేశారు.


హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ నిన్న(ఆదివారం) అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా ఐపీఎస్ వాంగ్మూలం తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పోస్ట్ పెట్టారు.


ఉదయ్‌ కృష్ణారెడ్డికి నోటీసులు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి అత్తాపూర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై 8 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి.. నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి తన సొంత ఊరు ప్రకాశం జిల్లాకు వెళ్లిపోయారు. ఈ కేసును జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 12:38 PM