Share News

5 వేల కిలోల లడ్డూలతో జగన్నాథ రథం

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:06 AM

డీఎన్‌డీఎల్‌ డివోషనల్‌ ట్రస్ట్‌, హరేకృష్ణ భక్త సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.

5 వేల కిలోల లడ్డూలతో జగన్నాథ రథం

  • వైభవోపేతంగా పూరీ జగన్నాథ రథయాత్ర

సత్యనారాయణపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): డీఎన్‌డీఎల్‌ డివోషనల్‌ ట్రస్ట్‌, హరేకృష్ణ భక్త సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ యాత్రలో 5 వేల కిలోల లడ్డులతో తయారు చేసిన జగన్నాథుని రథం ప్రత్యేక హైలెట్‌. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దే అనూరాధ జగన్నాధుడు, బలబద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. భక్తబృందం నిర్వహించిన సంకీర్తనలు, భజనలు, కూచిపూడి, భరతనాట్యం, కోలాటం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాత్రలో ఇస్కాన్‌ ప్రతినధులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 04:06 AM