ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:38 AM
లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది. కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, జులై 20: లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది. కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని ఎన్‌పీఏ నుంచి అధికారులు పంపించేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన గురించి మొదట ఎన్‌పీఏ అధికారులకు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ కెమెరాల ఆధారాలతో పాటు అన్ని ఎవిడెన్స్ సేకరించాక ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు నిజమేనని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. దీంతో తక్షణమే ఎన్‌పీఏ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సర్వీస్‌లో జాయినింగ్‌కు సంబంధించి డీవోపీటీ దే తుది నిర్ణయం అని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
Read Latest Telangana News And Telugu News