బదిలీల్లో 5 ఆప్షన్లు.. అమలుకు 3 కమిటీలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:40 AM
ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారిని విధిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మార్గదర్శకాలు జారీ చేయడంతో వాటిని అన్వయం చేసుకొని నీటిపారుదల శాఖ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
నీటి పారుదల శాఖ మార్గదర్శకాల జారీ
ఇంటర్నెట్ డెస్క్: ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారిని విధిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మార్గదర్శకాలు జారీ చేయడంతో వాటిని అన్వయం చేసుకొని నీటిపారుదల శాఖ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. 2025 డిసెంబరు 31వ తేదీ నాటికి ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారు బదిలీ దరఖాస్తుల్లో ఐదు చోట్ల పనిచేయడానికి అంగీకరిస్తూ ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. ఇక 2027 మే 31వ తేదీ కన్నా ముందు పదవీ విరమణ చేయనున్న వారికి బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. మే 1 నుంచి 7వ తేదీ దాకా బదిలీ అయ్యేవారి జాబితాను సిద్ధం చేయనున్నారు. మే 8 నుంచి 15వ తేదీ దాకా ఆప్షన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మే 16 నుంచి 24వ తేదీ దాకా దరఖాస్తుల పరిశీలన, మే 25 నుంచి 31వ తేదీ బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర స్థాయిలో బదిలీల కోసం నీటి పారుదల శాఖ కార్యదర్శి కమిటీకి చైర్మన్‌గా, మల్టీ జోనల్/జోనల్ బదిలీలకు ఈఎన్‌సీ(జనరల్) చైర్మన్‌గా, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కమిటీ చైర్మన్‌గా బదిలీల ప్రక్రియ నడుస్తుందని ఈఎన్‌సీ(అడ్మిన్) వెల్లడించారు.