Share News

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:23 AM

భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది.

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 28) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం (Gold and Silver Rates).


ఈ రోజు (ఏప్రిల్ 28న) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,700గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,890గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,850గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,040గా ఉంది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,250గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,310గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,69,900గా, బెంగళూరులో రూ.2,59,900గాగా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తాము: రష్యా అధ్యక్షుడు పుతిన్

మరో ఆయిల్‌ ట్యాంకర్‌ను టార్గెట్ చేసిన ఇరాన్

Updated Date - Apr 28 , 2026 | 06:23 AM