మరో ఆయిల్ ట్యాంకర్‌ను టార్గెట్ చేసిన ఇరాన్
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:03 PM
భారతీయ సిబ్బంది ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు టార్గెట్ చేశాయి. అయితే, భారతీయ సిబ్బంది సేఫ్‌గా ఉన్నారని కేంద్రం తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒమన్ తీరానికి సమీపంలో మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు టార్గెట్ చేశాయి. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. షినాస్ పోర్టు సరిహద్దుకు సమీపంలో టోగో దేశ జెండా కలిగిన నౌక ఎమ్‌టీ సిరోన్‌పై ఏప్రిల్ 25న ఈ దాడి జరిగిందని తెలిపింది.
ఇరాన్ టార్గెట్ చేసిన నౌకలో భారత సిబ్బంది కూడా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల శాఖ మంత్రి మన్‌దీప్ సింగ్ రణ్‌ధావా తెలిపారు. ఇతర నౌకలతో పాటూ వెళుతున్న ఎమ్‌టీ సిరోన్ నౌకను ఇరాన్ కోస్ట్ గార్డు దళాలు అడ్డగించి హెచ్చరికగా కాల్పులు జరిపాయని చెప్పారు. అయితే, నౌకలో భారతీయ సిబ్బంది అంతా సేఫ్‌గా ఉన్నారని అన్నారు. విదేశాంగ శాఖతో పాటూ ఇతర వర్గాల సమన్వయంతో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. భారత నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
కాగా, గతంలో ఇరాన్ దళాలు రెండు భారతీయ నౌకలను టార్గెట్ చేశాయి. హోర్ముజ్‌ను దాటే ప్రయత్నంలో ఉన్న నౌకలను అడ్డగించి వెనక్కు మళ్లేలా చేశాయి. ఈ ఘటనల్లో భారతీయులు ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అయితే, ఇరాన్ చర్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
యూఏఈకి చేరిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్..