Share News

యూఏఈకి చేరిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్..

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:18 PM

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ చేతికి కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ చేరింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ 'ఐరన్ డోమ్' యూఏఈకి అందినట్టు వార్తలు వస్తున్నాయి.

యూఏఈకి చేరిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్..
Israel Iron Dome UAE

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ చేతికి కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ చేరింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ 'ఐరన్ డోమ్' యూఏఈకి అందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవస్థను నిర్వహించేందుకు ఇజ్రాయెల్ తన సైనిక దళాలను కూడా యూఏఈకి పంపింది. ఈ మేరకు ఓ అమెరికా పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది (Israel Iron Dome UAE).


యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను, డ్రోన్‌లను యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే కొన్ని ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. దీంతో యూఏఈ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ మిత్రదేశాల సహాయం కోరిందని తెలుస్తోంది. యూఏఈ విజ్ఞప్తి మేరకు ఇజ్రాయెల్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపిందని సమాచారం (Iran missile attacks UAE).


ఇజ్రాయెల్ ప్రధానికి యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ ఫోన్ చేశారని, ఆ తర్వాతే ఐరన్ డోమ్ వ్యవస్థను యూఏఈకి తరలించాల్సిందిగా నెతన్యాహు ఐడీఎఫ్ దళాలను ఆదేశించారని అమెరికా పత్రిక పేర్కొంది (Israel UAE military cooperation). ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ వచ్చిన తర్వాతే ఇరాన్ టార్గెట్ చేసిన అబుదాబికి ఊరట లభించింది. డజన్ల కొద్దీ వచ్చిన ఇరాన్ క్షిపణులను యూఏఈ ఈ ఐరన్ డోమ్‌తో అడ్డుకుంది.


ఇవి కూడా చదవండి..

రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..


న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

Updated Date - Apr 27 , 2026 | 01:18 PM