Share News

న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

ABN , Publish Date - Apr 27 , 2026 | 08:59 AM

భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)‌పై సోమవారం సంతకాలు కానున్నాయి. ఈ ఒప్పందాన్ని 'తరంలో ఒక్కసారి కుదిరే ఒప్పందం' అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు.

న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..
India New Zealand FTA

భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)‌పై సోమవారం సంతకాలు కానున్నాయి. ఈ ఒప్పందాన్ని 'తరంలో ఒక్కసారి కుదిరే ఒప్పందం' అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లనుందని అభిప్రాయపడ్డారు (India New Zealand FTA).


ఈ ఒప్పందం.. 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌లోకి కివీ ఎగుమతిదారులను స్వాగతిస్తుందని, ఎన్నో గొప్ప అవకాశాలను అందించనుందని లక్సన్ పేర్కొన్నారు. 'భారత్‌తో న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సోమవారం రాత్రి సంతకాలు జరుగుతాయి' అని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతయ్యే ఉత్పత్తులపై వంద శాతం పన్నుల మినహాయింపు లభించనుంది. వస్త్రాలు, లెదర్, ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్ గూడ్స్ వంటి రంగాలకు ఇది పెద్ద ఊతమివ్వనుంది. ఈ ఏడాది చివరి నుంచి ఈ ఫ్రీ-ట్రేడ్ అమల్లోకి రాబోతోంది (India NZ trade deal 2026).


అలాగే, న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులలో కొన్నింటిపై సుమారు 95 శాతం, మరికొన్నింటిపై పూర్తిగా వంద శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది (Free trade agreement India). ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ వచ్చే 15 సంవత్సరాల్లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్‌లో పెట్టనుంది. అదనంగా, విద్యార్థులు, నైపుణ్యంతో ఉన్న ఉద్యోగులకు వీసా అవకాశాలు కూడా పెరగనున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఈ పెద్దాయనకు భయమంటే తెలియదేమో! ట్రంప్ కార్యక్రమంలో వైరల్ సీన్

ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..

Updated Date - Apr 27 , 2026 | 08:59 AM