ఈ పెద్దాయనకు భయమంటే తెలియదేమో! ట్రంప్ కార్యక్రమంలో వైరల్ సీన్
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:19 PM
అమెరికాలో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల కలకలం రేగుతున్నా లెక్క చేయక తాపీగా ఫుడ్ ఆరగించిన ఒక పెద్దాయన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు కలకలం రేగిన విషయం తెలిసిందే. తుపాకీ పేలిన శబ్దం వినగానే అక్కడున్న వారందరూ భయపడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక గడగడ వణికిపోయారు. ఇంతటి భయానక వాతావరణంలో ఓ పెద్దాయన తనకేమీ పట్టనట్టు ప్రశాంతంగా తన మానాన తాను ఆహారాన్ని ఆరగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కార్యక్రమానికి వచ్చిన అనేక మంది అతిథుల్లో ఈ పెద్దాయన కూడా ఒకరు. అక్కడ అందరితో పాటు ఆయన విందును ఆరగిస్తుండగా కాల్పుల కలకలం రేగింది. తుపాకీ శబ్దం వినగానే అక్కడున్న వారు ప్రాణభయంతో వణికిపోయారు. కానీ పెద్దాయన మాత్రం తాపీగా తలపైకెత్తి ఒకసారి చూసి మళ్లీ తనమానాన తాను తినడం ప్రారంభించారు. అవి తాటాకు చప్పుళ్లు అన్నట్టు ఆ పెద్దాయన తీరు కనిపించింది.
ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పెద్దాయనకు భయమంటే తెలియదనుకుంట అని కొందరు అన్నారు. భద్రతా ఏర్పాట్లపై పూర్తి నమ్మకం ఉండటంతోనే పెద్దాయన అంత కూల్‌గా ఉన్నారని అన్నారు. అంత ఖరీదైన ఫుడ్‌ను వదులుకోవడం పెద్దాయనకు ఇష్టం లేదనుకుంట అని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఈ వార్తలనూ చదవండి:
ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..
బద్దలైన అగ్ని పర్వతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు..