Share News

బద్దలైన అగ్ని పర్వతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు..

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:54 PM

ఏప్రిల్ 20వ తేదీన గ్వాటెమాలాలో అగ్ని పర్వతం బద్దలైంది. ప్రాణ భయంతో పర్వతారోహకులు పరుగులు తీశారు. కార్లోస్ ఎన్రిక్ పోరెస్ రోడాస్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు.

బద్దలైన అగ్ని పర్వతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు..
Santiaguito volcano eruption

ఇంటర్‌నెట్ డెస్క్: లాటిన్ అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన అగ్ని పర్వతాలలో శాంటియాగుయిటో అగ్ని పర్వతం కూడా ఒకటి. అగ్ని పర్వతం దగ్గర నిరంతరం విస్పోటనాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో అగ్ని పర్వతానికి 5.3 మైళ్ల పరిధిని అధికారులు రిస్ట్రిక్టెడ్ జోన్‌గా ప్రకటించారు. జనం అటు వైపు వెళ్లవద్దన్న కఠిన ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికి పర్వతారోహకులు అగ్ని పర్వతం దగ్గరకు వెళుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏప్రిల్ 20వ తేదీన గ్వాటెమాలాలో అగ్ని పర్వతం బద్దలైంది. ప్రాణ భయంతో పర్వతారోహకులు పరుగులు తీశారు.


కార్లోస్ ఎన్రిక్ పోరెస్ రోడాస్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. అగ్ని పర్వతం ఒక్కసారిగా బద్దలైంది. కొన్ని మీటర్ల ఎత్తు వరకు దుమ్ము, ధూళి ఎగసిపడింది. పర్వతంపై ఉన్న పర్వతారోహకులు భయంతో కిందకు పరుగులు తీశారు. పేలుడు కారణంగా పర్వతంపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు కూడా కిందకు దొర్లి పడ్డాయి. వాటి కారణంగా కొంతమంది గాయపడ్డారు. 50 సెకన్ల ఆ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది: ప్రధాని మోదీ

పల్లీ కట్లి.. తయారు చేసుకోండిలా..

Updated Date - Apr 26 , 2026 | 01:55 PM