పల్లీ కట్లి.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:44 PM
పల్లీ కట్లి.. కావలసిన పదార్థాలు: పల్లీలు - రెండు కప్పులు, పాల పొడి - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, చక్కెర - కప్పు, నీళ్లు - పావు కప్పు, నెయ్యి - స్పూను.
కావలసిన పదార్థాలు: పల్లీలు - రెండు కప్పులు, పాల పొడి - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, చక్కెర - కప్పు, నీళ్లు - పావు కప్పు, నెయ్యి - స్పూను.
తయారుచేసే విధానం: పల్లీలను వేయించుకుని పొట్టు తీసి, మిక్సీలో మెత్తని పొడిగా చేసుకోవాలి. దీనికి పాల పొడి, యాలకుల పొడి జతచేయాలి. ఓ మందపాటి బాణలిలో చక్కెర, నీళ్లని కలిపి పాకం పట్టాలి. పాకం తీగగా మారుతుంటే పల్లీ మిశ్రమాన్ని కలిపి, తక్కువ మంట మీద ఉడికించాలి. అంతా దగ్గరవుతుంటే నెయ్యి కలిపి స్టవ్ కట్టేయాలి. నెయ్యి రాసిన పళ్లెం మీద ఈ మిశ్రమాన్ని వేసి ముక్కలుగా కోస్తే పల్లీల కట్లి సిద్ధం.

ఈ వార్తలు కూడా చదవండి:
సమ్మర్ టూర్‌కు సిద్ధమవుతున్నారా?
Read Latest Telangana News and National News