నిమ్మరసం రాస్తే జుట్టు తెల్లబడుతుందా?
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:41 AM
జుట్టుకు నిమ్మరసం రాస్తే త్వరగా తెల్లబడిపోతుందనే మాట చాలా మంది అంటుంటారు. అయితే.. ఇది నిజమా లేక కేవలం అపోహేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు, నిమ్మరసం జుట్టుకు మేలు చేస్తుందా లేదా నష్టం చేస్తుందా? అనేది తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: జుట్టుకు నిమ్మరసం రాస్తే త్వరగా తెల్లబడిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. నిమ్మరసం వల్ల జుట్టు తెల్లబడదు. నిమ్మకాయలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి మంచివే. అదే విధంగా జుట్టుకు కూడా కొంత మేలు చేస్తాయి. ముఖ్యంగా చుండ్రు, తల చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం జుట్టును తెల్లగా చేయదు. అయితే, ఇందులో ఉన్న ఆమ్ల గుణం వల్ల నేరుగా రాస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. అందుకే సరైన విధంగా వాడాలి.
నిమ్మరసం ఎలా వాడాలి?
నిమ్మరసాన్ని నేరుగా జుట్టుకు రాయకూడదు.
కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో కలిపి వాడాలి.
ఆముదంతో కలిపి రాస్తే మంచిది.
మెంతుల పేస్ట్‌తో కలిపి రాస్తే చుండ్రు తగ్గుతుంది.
షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలిపి కూడా వాడవచ్చు.
జాగ్రత్తలు:
నేరుగా నిమ్మరసం రాయడం మంచిది కాదు.
ప్రతిరోజూ వాడకూడదు.
ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలి.
ఎక్కువగా వాడితే తల చర్మం పొడిబారుతుంది.
15–20 రోజులకు ఒకసారి మాత్రమే వాడటం మంచిది.
నిమ్మరసం వల్ల జుట్టు తెల్లబడదు. కానీ సరైన విధంగా వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News