ఢిల్లీలో స్విస్ విమానానికి మంటలు.. ఆరుగురికి గాయాలు..
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:04 AM
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదం కలకలం రేపింది. స్విస్ ఎయిర్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో టేకాఫ్ సమయంలో లోపం తలెత్తి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదం కలకలం రేపింది. స్విస్ ఎయిర్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో టేకాఫ్ సమయంలో లోపం తలెత్తి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి జ్యూరిక్‌కు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో మంటలు చెలరేగాయి (Swiss Air fire Delhi).
వెంటనే పైలట్లు టేకాఫ్‌ను నిలిపివేసి అత్యవసర చర్యలు ప్రారంభించారు. విమానంలో ఉన్న ప్రయాణికులను అత్యవసర స్లైడ్ల ద్వారా కిందకు దించారు. ఈ సమయంలో తెలెత్తిన గందరగోళంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఎయిర్‌బస్ ఏ330 విమానంలో సుమారు 228 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించగానే సిబ్బంది చురుకుగా స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు (Delhi airport flight fire).
'భారతదేశ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 1 గంట దాటిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది (Swiss flight evacuation). విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, ఇంజన్లలో ఒకదానిలో సమస్య తలెత్తింది. సిబ్బంది టేకాఫ్‌ను రద్దు చేసి, ముందు జాగ్రత్తగా విమానాన్ని ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆరుగురు ప్రయాణికులకు వైద్య సహాయం అందుతోంది. సిబ్బంది క్షేమంగా ఉన్నారు' అని స్విస్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..